జీవితం

తంగెళ్ళశ్రీదేవి 
రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు  నవలా రచయిత్రి. నవలలతో పాటు, కథలు, కవితలు రాశారు. వీరు రచించిన నవలలు,  కథలు అనేక ప్రముఖ వార, మాస పత్రికలలో ప్రచురితమైనవి. నేటి  వనపర్తి జిల్లాలోని  ఒక మండల కేంద్రమైన అత్మకూర్ వీరి స్వస్థలం. ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

కుటుంబ నేపథ్యం 
 తల్లి తంగెళ్ళ సుజాత,  తండ్రి తంగెళ్ళ శ్రీనివాస్ రెడ్డి.

విద్యాభ్యాసం 
స్వస్థలమైన ఆత్మకూరులో  పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేశారు.  ఉస్మానియా యూనివర్సిటి నుండి.  ఎం.ఏ. తెలుగు పూర్తి చేశారు. అక్కడే  తెలుగు వార పత్రికలు- సాహిత్య వికాసం అను అంశంపై పరిశోధన చేసి , పిహెచ్.డి పట్టాను పొందారు.

వృత్తి 
వీరు తెలుగు ఉపన్యాసకులు.  ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్  కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన ఆచార్య జి. రాంరెడ్డి దూర విద్యా కేంద్రానికి సంబంధించి ఎం. ఏ. తెలుగు   పాఠ్యపుస్తకాల రూపకల్పన బృందంలో వీరు సభ్యులుగానూ పని చేశారు.   

రచనలు 
ఇప్పటి వరకు వీరు 7 నవలలు, సుమారు 50 దాక కథలు,  అనేక కవితలు, వివిధ అంశాలపై వ్యాసాలు రాశారు. వీరి నవలలు స్వాతి, చతుర వంటి మాస పత్రికలలో ప్రచురించబడినవి. వీరి కథలు వివిధ  దిన, వార పత్రికలలో ప్రచురించబడినవి. రచయితలకు  కులం మతం ప్రాంతం లేదన్నది వీరి అభిప్రాయం.  ఆ అభిప్రాయంతోనే వీరు తెలంగాణకు చెందిన వారైనా,  ఆంధ్ర ప్రదేశ్ కు  దక్కవలసిన  ‘ప్రత్యేక హోదా’  అంశంపై సాగుతున్న ఉద్యమానికి ఊతంగా ఈమె  పాటలు రచించారు. అవి  ఆంధ్ర ప్రాంతంలో ప్రాచుర్యం పొందాయి.

1 comment:

  1. Simhapuri Hospitals. The best hospitals in Nellore
    http://simhapurihospitals.com/

    ReplyDelete