Monday, April 15, 2024

రెడ్డి గుడి ( నాగలింగేశ్వరుడు )

రెడ్డి గుడి 
( నాగ లింగేశ్వరుడు )
°°°°°°°°°°°
✍️తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి

కాకతీయ సామంతరాజుల్లో రేచర్లరెడ్డి రాజులు ఒకరు. వీరి చరిత్ర గణనీయమైనది.
రేచర్ల బ్రహ్మారెడ్డి / బమ్మిరెడ్డి వంశ మూలపురుషుడు. రేచర్లరెడ్లల్లో రుద్రారెడ్డి సుప్రసిద్ధుడు. వీరు ప్రపంచప్రసిద్ధి గాంచిన రామప్పదేవాలయం నిర్మాత. కాకతీయ గణపతిదేవుడు పట్టాభిశిక్తుడు కావడంలో యాదవరాజులను ఓడించడంలో సేనానిగా కీలకపాత్ర వహించాడు. రుద్రసేనానిగా రుద్రయ్యగా చరిత్రలో పేర్కొనబడ్డాడు. వీరికి ముగ్గురు కుమారులు -  
1 లోక సేనాని 2. పెద్ద గణపతిరెడ్డి 3.నాలుగో కాటసేనాని. వీరిలో పెద్దగణపతిరెడ్డి ఘణపురం సామంతుడు. వీరి ఆధ్వర్యంలో గణపేశ్వరాలయంతో పాటు వివిధ ఆలయాలను నిర్మించబడ్డాయి.. వాటిలో ఒకటి రెడ్డిగుడి. నాగలింగేశ్వరుడుగా శివదేవుడు ప్రతిష్టించబడ్డాడు.

రెడ్డిగుడి దేవాలయ నిర్మాణం :

 13 వ శతాబ్దపు ప్రాచీన శైవ దేవాలయంగా నమోదు చేయబడిన రెడ్డిగుడి వరంగల్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘన్‌పూర్ గ్రామంలో ఉన్నది. చారిత్రాత్మకమైన ఈ శివాలయం స్థానికంగా "రెడ్డి గుడి" గా పిలువబడుతున్నది. గణపతిరెడ్డి నిర్మించాడు కాబట్టి పూర్వం నుండి కూడా "రెడ్డి గుడి"గా వ్యవహరించబడుతున్నదిగా చరిత్రకారులు అభిప్రాయపడ్తున్నారు..

No comments:

Post a Comment