Monday, April 15, 2024

రెడ్ల పేర్లతో గ్రామనామాలు

రెడ్ల పేర్లతో ఊరిపేర్లు 
°°°°°°°°°°°°°°°°°°°°
కూర్పు : తంగెళ్ళశ్రీదేవిరెడ్డి 

మల్లంపల్లి సోమశేఖర శర్మ, బి. ఎన్ శాస్త్రి వంటి చారిత్రక అఖండ పరిశోధకులు రెడ్ల పాలన, రెడ్ల వంశ క్రమం, వారి చారిత్రక వైభవం గురించి పరిశోధించి ముద్రించారు. ఈ క్రమంలో రెడ్ల వైభవం పాలనా దక్షత స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే ఇక్కడ రెడ్డి అనే పదం పరిపాలన అర్థంలో తీసుకోవాలి. ఎందుకంటే... ఇప్పటికీ కొన్ని రాయలసీమ ఆంధ్ర ప్రాంతాల్లో తమ గ్రామాలను పాలించే ఇతర కులస్థులను కూడా రెడ్డి అనే పిలుస్తుంటారు. ప్రాచీన కాలం నుండి కూడా రెడ్డి అంటే పాలించేవాడు, కాపలా ఉండేవాడు, ఆదుకునే వాడు, ఆదరించే వాడు అనే అర్థాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంచికి మారుపేరుగా మిగిలిన రెడ్ల పేరుమీద గ్రామాలు కూడా ఏర్పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో రెడ్లు కొనసాగించిన పాలనకు, ,త్యాగానికి, పాటించిన ధర్మానికి నెనరు కనబరుస్తూ గుర్తుగానో స్మృతిగానో మర్యాద పూర్వకంగానో వారి వారి పేర్లమీద గ్రామాలు పట్టణాలు వెలిసాయి. ఒక్క తెలుగు ప్రాంతాల్లోనే కాదు, తమిళనాడు కర్ణాటక ప్రాంతాల్లో కూడా రెడ్ల పేరుతో రహదార్లు, ప్రాంతాలు, గ్రామాలు, ఏర్పడ్డాయి. 
రెడ్ల గురించిన నా పరిశోధనలో ఇటువంటి గ్రామాలను తెలుగు ప్రాంతాల నుండి దాదాపుగా సేకరించాను. ఇవన్నీ ప్రభుత్వం గుర్తించిన రెవెన్యూ గ్రామాలు. అయితే సేకరించని నిర్జన గ్రామాలు అక్కడక్కడా
ఉన్నాయి. అట్లాగే మరో గ్రామంలో అంతర్భంగంగా ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. వీటిని పూర్తిగా సేకరించలేదు
కొంత సమాచారాన్ని మాత్రం వ్యక్తుల ద్వారా సేకరించాను. & గుర్తు కింద ఈ గ్రామాలను పొందు పర్చాను. వీటి ఉనికి నిర్దారణ చేసుకోవాల్సి ఉన్నది . 

 
👉 #తెలంగాణ_రాష్టం 
°°°°°°°°°°°°°°°°°°°°°°°

తెలంగాణ రాష్టంలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. జిల్లాల వారీగా గమనిస్తే దాదాపుగా ప్రతి జిల్లాలో రెడ్డి పేరుతో గ్రామాలు ఉన్నాయి. 

1 ) #ఆదిలాబాద్_జిల్లా

దమ్మిరెడ్డి పేట ( నెన్నెల్ మండలం )

⭕️ 2 ) #కొమరంభీంజిల్లా_ఆసిఫాబాద్

    ఈ జిల్లాలో నా పరిశోధనలో ఒక్క రెడ్డి పేరుతో ఉన్న గ్రామ నామం నా దృష్టికి రాలేదు. 

3 ) #భద్రాద్రి_కొత్తగూడెంజిల్లా 

అన్నపురెడ్డిపల్లె మండల కేంద్రం 
పెద్దిరెడ్డి గూడెం ( అన్నపురెడ్డి మండలం )
సింగిరెడ్డి పల్లి - ఏల్చిరెడ్డి పల్లి ( ఈ రెండు గ్రామాలు పినపాక మండలం )
రెడ్డి పాలెం (బూర్గంపహడ్ మండలం )

4 ) #జయశంకర్_భూపాలపల్లి 

రాఘవరెడ్డి పేట ( టేకుమట్ల మండలం )
రెడ్డిపల్లి ( ముత్తారం మండలం )

5 ) #జోగులాంబ_గద్వాల 

బూరెడ్డిపల్లి & చిన్నారెడ్డి పల్లి ( ధరూర్ మండలం )

6 ) #హైదరాబాద్_జిల్లా

హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలకు రెడ్ల పేర్లు ఉన్నాయి. 
సంజీవరెడ్డి నగర్ ( SR నగర్ )
B.N. రెడ్డి నగర్ 
రెడ్డి కాలనీ, (బైరామల్ గూడ, ఎల్ బి నగర్,)
ఎల్లారెడ్డి గూడ ( షేక్ పేట్ మండలం )

⭕️ 7 ) #జగిత్యాల_జిల్లా 

    ఈ జిల్లాలో నా పరిశోధనలో ఒక్క రెడ్డి పేరుతో ఉన్న గ్రామ నామం నా దృష్టికి రాలేదు. 

8 ) #జనగామ_జిల్లా

నాగిరెడ్డి పల్లి - బసిరెడ్డి పల్లి - కేశిరెడ్డి పల్లి ( బచ్చన్న పేట మండలం పరిధిలో ఈ మూడు గ్రామాలు ఉన్నాయి )

9 ) #కామారెడ్డి_జిల్లా

  ఈ జిల్లాలో వున్న కొన్ని మండలాలకు కూడా రెడ్ల పేర్లు ఉన్నాయి 
కామారెడ్డి - మాచారెడ్డి - ఎల్లారెడ్డి - నాగిరెడ్డి పేట రామారెడ్డి ( ఈ ఐదు మండల కేంద్రాలు ) 

చిన్న మల్లారెడ్డి గ్రామం ( కామారెడ్డి మండలం )
పెద్ద మల్లారెడ్డి గ్రామం, ( భిక్నూర్?మండలం )
అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామం ( సదా శివనగర్ మండలం )
తిమ్మారెడ్డి పల్లి ( ఎల్లారెడ్డి మండలం )
ధర్మారెడ్డి గ్రామం - కన్నారెడ్డి గ్రామం ( ఈ రెండు గ్రామాలు నాగిరెడ్డి పేట మండలం)
పోతిరెడ్డి పల్లి ( పిట్లం మండలం )
రాంరెడ్డి పల్లి ( బీబీపేట మండలం )
రెడ్డి పేట ( రామారెడ్డి మండలం )

10 ) #కరీంనగర్_జిల్లా

      కాచిరెడ్డి పల్లి - సర్వారెడ్డి పల్లి - నాగిరెడ్డి పూర్ ( ఈ మూడు గ్రామాలు గంగాధర మండలం పరిధిలోనివి ).
పోతిరెడ్డి పేట ( హుజురాబాద్ మండలం ).

పోతిరెడ్డి పల్లె - రెడ్డి పల్లె (ఈ రెండు గ్రామాలు వీణవంక మండలం )
 
&
ఎల్లారెడ్డి పేట -మల్లారెడ్డి పల్లి (వీణవంక మండలం పరిధి లోనివి )

11 ) #ఖమ్మం_జిల్లా

కేశిరెడ్డి పల్లి ( ఎర్రుపాలెం మండలం )
సింగారెడ్డి పాలెం ( నేలకొండపల్లి మండలం )
తిప్పారెడ్డి గూడెం (తిరుమలాయ పాలెం మండలం )
రెడ్డి పాలెం

12 ) #మహబూబాబాద్_జిల్లా

సాదిరెడ్డి పల్లి ( కొత్తగూడ మండలం )

13 ) #పాలమూరు_జిల్లా

  కొమ్మిరెడ్డి పల్లి ( మూసాపేట మండలం )
ఎల్లారెడ్డి పల్లి ( కోయిలకొండ మండలం )
రంగారెడ్డి గూడ ( రాజాపూర్ మండలం )
కేతిరెడ్డి పల్లి ( బాలాపూర్ మండలం )
బూరెడ్డి పల్లి (జడ్చర్ల మండల )
&
జంగారెడ్డిపల్లి -రాంరెడ్డిపల్లి - గౌరెడ్డిపల్లి - కొండారెడ్డిపల్లి - 

14 ) #మంచిర్యాల_జిల్లా

రెడ్డి పల్లి ( భీమారం మండలం )
దమ్మిరెడ్డి పేట ( నెన్నెల్ మండలం )

15 ) #మెదక్_జిల్లా
 
లింగారెడ్డి పేట - ముప్పిరెడ్డి పేట ( ఈ రెండు గ్రామాలు మనోహరాబాద్ మండలం )
లింగారెడ్డి పల్లి ( ఎల్దుర్తి మండలం )
రెడ్డి పల్లి ( చేగుంట మండలం )
గుండారెడ్డి పల్లి ( తుఫ్రాన్ మండలం )
రెడ్డి పల్లి ( నర్సాపూర్ మండలం )
పోతిరెడ్డి పల్లి ( కుల్చారం మండలం )
కొండారెడ్డి పల్లి  

16 ) #మేడ్చెల్_మల్కాజ్‌గిరి 

మైసిరెడ్డి పల్లి ( మేడ్చెల్ మండలం )

17 ) #నల్లగొండ_జిల్లా

అన్నారెడ్డి గూడ ( నల్లగొండ మండలం )
ఎల్లారెడ్డి గూడ ( నార్కెట్ పల్లి మండలం )
జంగారెడ్డి గూడెం ( తిప్పర్తి మండలం )
అన్నపురెడ్డి గూడ & తిమ్మారెడ్డి గూడెం ( ఈ రెండు గ్రామాలు వేములపల్లి మండలం )
కామారెడ్డి గూడెం ( త్రిపురారం )
మల్లారెడ్డి పల్లి ( చింతపల్లి మండలం )
&
-రామ్ రెడ్డి పల్లి - రెడ్డి బావి - 
- పోరెడ్డి పల్లి ( వేములపల్లి దగ్గర )  
      పోరెడ్డి గూడెం 
 - వద్దిరెడ్డిగూడెం ( గుర్రంపోడ్ మండలం )
దేవిరెడ్డి గూడెం ( నారాయణ పూర్ మండలం )
మల్లారెడ్డి గూడెం (మేళ్లచెరువు మండలం )

18 ) #నాగర్_కర్నూల్_జిల్లా 

పోతిరెడ్డిపల్లి ( తిమ్మాజిపేట్ మండలం )
యాదిరెడ్డి పల్లి ( తాడూరు మండలం )
ముత్తిరెడ్డి పల్లి ( కోడేరు మండలం )
రాంరెడ్డి పల్లి ( ఉర్కొండ మండలం )
లింగారెడ్డి పల్లి ( వెల్డండ మండలం )
సేరి అప్పారెడ్డి పల్లి ( చారుకొండ మండలం )
కొండారెడ్డి పల్లి ( బల్మూర్ మండలం )
జంగారెడ్డి పల్లి (అమ్రాబాద్ మండలం )

 రాం రెడ్డి పల్లి - గౌరెడ్డి పల్లి - కమ్మ రెడ్డి పల్లి ( ఈ మూడు గ్రామాలు తెలకపల్లి మండలం )
సర్వారెడ్డి పల్లి - కొండారెడ్డి పల్లి - తిప్పారెడ్డి పల్లి - పోతారెడ్డి పల్లి ( ఈ నాలుగు గ్రామాలు వంగూరు మండలం )

19 ) #నిర్మల్_జిల్లా
యెల్లరెడ్డిపేట (నిర్మల్ గ్రామీణ మండలంలోని గ్రామం)

20 ) #నిజామాబాద్_జిల్లా
చిన్న మల్లారెడ్డి గ్రామం ( కామారెడ్డి మండలం )

21 ) #రంగారెడ్డి_జిల్లా
 రాంరెడ్డి గూడ ( ఇబ్రహీంపట్నం మండలం )
నాగిరెడ్డి పల్లి ( మహేశ్వరం మండలం )
రెడ్డపల్లి - నాగిరెడ్డి గూడ,కేతిరెడ్డి పల్లి 
 ( ఈ మూడు గ్రామాలు మొయినాబాద్ మండలం )
అప్పారెడ్డి పల్లి ( మాడుగుల మండలం )
పాపిరెడ్డి గూడ ( కేశంపేట మండలం )
చేగిరెడ్డి ఘనపూర్ - చెన్నారెడ్డి గూడ ( ఈ రెండు గ్రామాలు చౌదర్ గూడెం మండలం )
నాగిరెడ్డి గూడ ( కడ్తాల్ మండలం )
& కాశిరెడ్డి గూడెం, లింగారెడ్డి గూడెం,వెంకటరెడ్డి పల్లె 

22 ) #పెద్దపల్లి_జిల్లా

బొమ్మారెడ్డి పల్లి ( ధర్మారం మండలం )

23 ) #సంగారెడ్డి_జిల్లా

పోతిరెడ్డి పల్లి (సంగారెడ్డి పరిధి )
మాచిరెడ్డి పల్లి ( సదాశివ పేట మండలం )
కాచిరెడ్డి పల్లి (రామచంద్రపురం మండలం )
భుసారెడ్డి పల్లి ( మునిపల్లి మండలం )

పెద్దారెడ్డి పేట్ - సూరెడ్డి ఇటిక్యాల -సేరిరాంరెడ్డి గూడ ( ఈ మూడు గ్రామాలు పుల్కల్ మండలం )

సేరి మల్లారెడ్డి పల్లి - పోతారెడ్డి పల్లి - కొండారెడ్డి పల్లి ( ఈ మూడు గ్రామాలు ఆంథోల్ మండలం )

రాంరెడ్డి పేట్ ( కల్హేరు మండలం )
రెడ్డి ఖానాపూర్ ( హత్నూర్ మండలం )

పోతిరెడ్డి పల్లి - మాచిరెడ్డి పల్లి - నాగిరెడ్డి పల్లి ( ఈ మూడు గ్రామాలు కోహిర్ మండలం )

24 ) #సిద్దిపేట_జిల్లా

జప్తిలింగారెడ్డిపల్లి - ఎల్లారెడ్డిపేట ( ఈ రెండు గ్రామాలు 
  తొగుట మండలం )
చెర్ల అంకిరెడ్డిపల్లి ( చిన్నకోడూరు మండలం )
వీరారెడ్డి పల్లి ( మీర్ దొడ్డి మండలం )
పోతారెడ్డి పేట ( దుబ్బాక మండలం )
అంకిరెడ్డి పల్లి - తిమ్మారెడ్డి పల్లి ( ఈ రెండు గ్రామాలు కొండపాక మండలం )
 అంకిరెడ్డి పల్లి - లింగారెడ్డి పల్లి ( ఈ రెండు గ్రామాలు రాయ్ పోల్ మండలం )
గుండారెడ్డి పల్లి ( కోహెడ మండలం )
ధర్మారెడ్డి పల్లి ( గజ్వేల్ మండలం )
&

రాజిరెడ్డి పల్లి ( గజ్వేల్ దగ్గర )

25 ) #రాజన్న_సిరిసిల్ల_జిల్లా

ఎల్లారెడ్డి పేట ( మండల కేంద్రం 
పోతారెడ్డి పల్లి ( యెల్లారెడ్డి పేట మండలం )
మల్లారెడ్డి పేట ( గంభీరావు పేట మండలం )
జంగారెడ్డిపల్లి ( ఇల్లింతకుంట మండలం )
&
అంకిరెడ్డి పల్లి 

26 ) #సూర్యాపేటజిల్లా

జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం ( ఈ ఊరు పేరు ఉస్మానియా విప్లవ కెరటం జార్జిరెడ్డి పేరు మీద ఏర్పడింది అనేది ఒక కథనం. సరైన ఆధారాలు సేకరించాల్సి ఉన్నది. )
సింగారెడ్డి పాలెం ( పెన్ పహాడ్ మండలం )
రెడ్ల కుంట ( కోదాడ మండలం )

&
అనిరెడ్డి గూడెం ( పెన్ పహాడ్ మండలం )
మాచిరెడ్డి పల్లి ( నాగారం మండలం )
నాగిరెడ్డి గూడెం - పారెడ్డి గూడెం 

27 ) #వికారాబాద్_జిల్లా

మాదిరెడ్డిపల్లి (నవాబ్‌పేట్‌ మండలం)
కామారెడ్డిగూడ - శివారెడ్డి పేట ( ఈ రెండు గ్రామాలు వికారాబాద్ మండలం )
పోతిరెడ్డిగూడా ( పూడూర్‌ మండలం ) 
బొమ్మిరెడ్డిపల్లి (కుల్కచర్ల మండలం )
అనంతరెడ్డి పల్లి - పోతిరెడ్డి పల్లి - శివారెడ్డి పల్లి ( ఈ మూడు గ్రామాలు దోమ మండలం )
బసిరెడ్డి పల్లి - రాంరెడ్డి పల్లి ( ఈ రెండు గ్రామాలు పరిగి మండలం )
నాగిరెడ్డి పల్లి ( బొమ్మరాసుపేట మండలం )
తిమ్మారెడ్డి పల్లి ( దౌలతాబాద్ మండలం )
రెడ్డి ఘనపూర్ ( బషీరాబాగ్ మండలం )
మల్ రెడ్డి పల్లి - శంకర్ రెడ్డి పల్లి ( ఈ రెండు గ్రామాలు తాండూరు మండలం )
&
సంకిరెడ్డిపల్లి ( తాండూరు మండలం )

28 ) #వనపర్తి_జిల్లా

పామిరెడ్డి పల్లి ( పెద్దమందడి మండలం )
అప్పారెడ్డి పల్లి ( ఘన్ పూర్ మండలం )
బుసిరెడ్డి పల్లి ( పాన్ గల్ మండలం )
సంకిరెడ్డి పల్లి & పుల్లారెడ్డి కుంట ( కొత్తకోట మండలం )
ముసలిరెడ్డి పల్లి ( ఆత్మకూరులో అంతర్భాగంగా )

29 ) #వరంగల్_పట్టణ_జిల్లా

 మల్లారెడ్డి పల్లి ( హసన్ పర్తి మండలం )

30 ) #వరంగల్_గ్రామీణ_జిల్లా

పోతిరెడ్డి పల్లి ( రాయపర్తి మండలం )
కామారెడ్డి పల్లి (పరకాల మండలం )
రెడ్ల వాడ ( నెక్కొండ మండలం )

31) #యాదాద్రి_భువనగిరి జిల్లా

వీరారెడ్డి పల్లి ( తుర్కపల్లి మండలం )
నాగిరెడ్డి పల్లి ( భువనగిరి మండలం )
మైసిరెడ్డి పల్లి ( బొమ్మల రామారం మండలం )
ధర్మారెడ్డి పల్లి ( బి. పోచంపల్లి మండలం )
రెడ్ల రేపాక ( వలిగొండ మండలం )
ధర్మారెడ్డి గూడెం 
⭕️ 32 ) #ములుగు_జిల్లా 

    ఈ జిల్లాలో నా పరిశోధనలో ఒక్క రెడ్డి పేరుతో ఉన్న గ్రామ నామం నా దృష్టికి రాలేదు. 

33 ) #నారాయణపేట_జిల్లా

అప్పిరెడ్డి పల్లి - అమ్మిరెడ్డి పల్లి - కొండారెడ్డి పల్లి ( ఈ మూడు గ్రామాలు నారాయణపేట మండలం పరిధి లోనివి ).
మల్ రెడ్డి పల్లి ( దామరగిద్ద మండలం ).
ముదిరెడ్డి పల్లి ( కోస్గి మండలం ).
నాగిరెడ్డి పల్లి - చెన్ రెడ్డి పల్లి - తిమ్మారెడ్డి పల్లి ( ఈ మూడు గ్రామాలు మద్దూరు మండలం )
నాగిరెడ్డి పల్లి ( ఊట్కూరు మండలం )
జంగంరెడ్డి పల్లి - నాగిరెడ్డి పల్లి ( నర్వ మండలం )

 👉#ఆంధ్రప్రదేశ్ 
°°°°°°°°°°°°°°°°°°°

 #మధ్యాంధ్ర ( గుంటూరు, ప్రకాశం, నెల్లూరు )
#ఉత్తరాంధ్ర ( శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ) #కోస్తాంధ్ర ( ఉభయ గోదావరి జిల్లాలు, క్రిష్ణ

#రాయలసీమ (కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు ) ప్రాంతాలు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్టం

#మధ్యాంధ్ర 

1 ) #గుంటూరు_జిల్లా 

రెడ్డి పాలెం ( గుంటూరులో కలిసిపోయి వున్నది )
అంకిరెడ్డిపాలెం ( గుంటూరు మండలం )
పాతరెడ్డిపాలెం - కొత్తరెడ్డి పాలెం ( ఈ రెండు గ్రామాలు చేబ్రోలు మండలం )
రెడ్డి గూడెం ( రాజుపాలెం మండలం )
సుబ్బారెడ్డి పాలెం ( బాపట్ల మండలం )
రామిరెడ్డిపాలెం - వి. రెడ్డి పాలెం ( ఈ రెండు గ్రామాలు రొంపిచర్ల మండలం )
శివారెడ్డి పాలెం ( గుంటూరు దగ్గర )

2) #ప్రకాశo_జిల్లా

కొత్తరెడ్డి పాలెం ( అద్దంకి మండలం )
నర్సిరెడ్డి పల్లి ( దర్శి మండలం )
బొమ్మిరెడ్డి పల్లి ( కనిగిరి మండలం )
దేవిరెడ్డి పాలెం ( కొండపి మండలం )
వజ్జిరెడ్డి పాలెం ( కొత్తపట్నం మండలం )
నాగిరెడ్డి పల్లి ( కొనకనమిట్ల మండలం )
బసిరెడ్డిపాలెం ( గుడ్లూరు మండలం )
రెడ్డిపాలెం ( జరుగుమల్లి మండలం )
సూరారెడ్డి పాలెం ( టంగుటూరు మండలం )
నాసరరెడ్డి నగర్ ( త్రిపురాంతకం మండలం )
నాగిరెడ్డిపల్లి ( వెలిగండ్ల మండలం )
చల్లారెడ్డి పాలెం ( వేటపాలెం మండలం )
కొండారెడ్డి పాలెం ( వోలేటి వారి పాలెం మండలం )
రామిరెడ్డి పాలెం ( సంతమాగులూరు మండలం )
రెడ్డి నగర్ (ముండ్లమూరు మండలం )
బశిరెడ్డి పల్లి (అర్దవీడు మండలం)
నర్శిరెడ్డి పల్లి( కంభం మండలం)

సర్విరెడ్డి పాలెం - సర్వేరెడ్డి పాలెం , ( ఈ రెండు గ్రామాలు ఒంగోలు మండలం )

నాగిరెడ్డిపల్లి - పుల్లారెడ్డి పల్లి - పొట్టిరెడ్డి పల్లి - 
బాలిరెడ్డి పల్లి - రెడ్డిచర్ల - లింగారెడ్డి పల్లి ( ఈ ఆరు గ్రామాలు కొమరోలు మండలం )

అంకిరెడ్డిపల్లి - చట్టిరెడ్డి పల్లి - వెంగళ్ రెడ్డి పల్లి ( ఈ మూడు గ్రామాలు గిద్దలూరు మండలం )

కొండారెడ్డి పల్లి - చెన్నారెడ్డి పల్లి - జంగంరెడ్డి పల్లి ( ఈ మూడు గ్రామాలు తుర్లపాడు మండలం )

కొత్తరెడ్డి పాలెం - పాపిరెడ్డి పాలెం - బసిరెడ్డి పల్లి ( ఈ మూడు గ్రామాలు దర్శి మండలం )

దాదిరెడ్డి పల్లి - భూమిరెడ్డి పల్లి ( ఈ రెండు గ్రామాలు పామూరు మండలం )

ఓబులరెడ్డి పల్లి - రంగారెడ్డి పల్లి ( ఈ రెండు గ్రామాలు రాచర్ల మండలం )

జంగారెడ్డి ఖండ్రిక - తిమ్మారెడ్డి పాలెం ( ఈ రెండు గ్రామాలు లింగసముద్రం మండలం )

గురువారెడ్డి పాలెం - నాంచారెడ్డి పాలెం ( ఈ రెండు గ్రామాలు సంతనూతల పాడు మండలం )

కొండారెడ్డి పల్లి - తిమ్మారెడ్డి పల్లి - వీరగరెడ్డి పల్లి ( ఈ మూడు గ్రామాలు హనుమంతునిపాడు మండలం )  
&
 రెడ్డిగారి పల్లె (ఈ ఊరికి 'అయ్యలూరివారిపల్లె' అని మారు పేరు కూడా ఉన్నది )

    
3 ) #నెల్లూరు జిల్లా
బుచ్చి రెడ్డి పాలెం (మండల కేంద్రం )

కామిరెడ్డి పాడు ( అనంతసాగరం మండలం )
గంగిరెడ్డిపల్లి ( ఉదయగిరి మండలం )
పెమ్మారెడ్డి పాలెం ( కొడవలూరు మండలం )
పోతిరెడ్డి పాలెం ( కోవూరు మండలం )
రెడ్డి కుంట ( గూడూరు మండలం )
రాయరెడ్డి పాలెం ( చిట్టమూరు మండలం )
పాపిరెడ్డి పాలెం ( తోటపల్లి గూడూరు మండలం )
అయ్యపురెడ్డి పాలెం ( నాయుడుపేట మండలం )
చెన్నారెడ్డి పల్లె ( పొదలకూరు మండలం )
చెన్నారెడ్డి పాలెం (బోగోలు మండలం )
గంగిరెడ్డి పాలెం ( వింజమూరు మండలం )
చెవిరెడ్డి పల్లి ( వేంకటగిరి మండలం )
చెన్నారెడ్డి పాలెం (బోగోలు మండలం )
గంగిరెడ్డి పాలెం ( వింజమూరు మండలం )
చెవిరెడ్డి పల్లి ( వేంకటగిరి మండలం )

రాఘవరెడ్డి పాలెం - వెంకటరెడ్డి పాలెం - లింగారెడ్డి పల్లి ( ఈ మూడు గ్రామాలు ఓజిలి మండలం ).
అయ్యపురెడ్డి పాలెం - నరసారెడ్డి పాలెం - బసిరెడ్డి పాలెం - వీరారెడ్డి పాలెం ( ఈ నాలుగు గ్రామాలు కలిగిరి మండలం ).
చింతారెడ్డి పాలెం - నారాయణరెడ్డి పేట ( నెల్లూరు మండలం ).
పాపిరెడ్డి పల్లి - వెంకటరెడ్డి పల్లి ( బాలాయపల్లి మండలం )
ఎర్రంరెడ్డి పల్లి - పెద్దిరెడ్డి పల్లి ( ఈ రెండు గ్రామాలు వరికుంటపాడు మండలం ).
బాలిరెడ్డి పాలెం - రెడ్డిపాలెం బిట్ 1 - రెడ్డిపాలెం బిట్ 2 ( ఈ మూడు గ్రామాలు వాకాడు మండలం ).
మారంరెడ్డి పల్లి - సింగారెడ్డి పల్లి ( ఈ రెండు గ్రామాలు సీతారాంపురం మండలం ).
కృష్ణారెడ్డి తగెలు - కేశవరెడ్డి పాలెం - గోపాలరెడ్డి పాలెం - సర్వారెడ్డి ఖండ్రిక ( ఈ నాలుగు గ్రామాలు సూళ్లూరుపేట మండలం ).
కృష్ణారెడ్డి పల్లి - తిప్పిరెడ్డి పల్లి ( సైదాపురం మండలం )

#కోస్తాంధ్ర 

4 ) #పశ్చిమగోదావరి_జిల్లా

జంగారెడ్డిగూడెం ( మండల కేంద్రం )
అక్కిరెడ్డిగూడెం ( దెందులూరు మండలం ) తిమ్మారెడ్డిపల్లి ( చింతలపూడి మండలం )
   
5 ) #తూర్పుగోదావరి_జిల్లా

లచ్చిరెడ్డిపాలెం (రౌతులపూడి)
లచ్చిరెడ్డిపాలెం (అడ్డతీగల)
దామిరెడ్డిపల్లి ( కడియం మండలం )

6) #కృష్ణ 

రెడ్డి గూడెం ( మండల కేంద్రం )
అమ్మిరెడ్డిగూడెం ( గంపలగూడెం మండలం )
పిన్నమరెడ్డిపల్లి (ఆగిరిపల్లి మండలం )
రెడ్డిపాలెం (గుడ్లవల్లేరు మండలం )
చేగిరెడ్డిపాడు ( జి.కొండూరు మండలం) 
కొమ్మిరెడ్డిపల్లి (తిరువూరుమండలం ).
 రామిరెడ్డిపల్లి (నందిగామ మండలం )
పోతురెడ్డిపల్లి (నూజివీడు మండలం )
వేమిరెడ్డి పల్లి ( విస్సన్నపేట మండలం )

లింగారెడ్డిపాలెం - యర్రారెడ్డివారి పాలెం ( ఈ రెండు గ్రామాలు కోడూరుమండలం )

&
అంకిరెడ్డి గూడెం 

#ఉత్తరాంధ్ర 

⭕️ 7 ) #శ్రీకాకుళం 

   ఈ జిల్లాలో నా పరిశోధనలో ఒక్క రెడ్డి పేరుతో ఉన్న గ్రామ నామం నా దృష్టికి రాలేదు. 

8 ) #విజయనగరం 

ద్వారపురెడ్డిపాలెం ( డెంకాడ మండలం )

9 ) #విశాఖపట్నం 

జత్తపురెడ్డితుని ( కశింకోట మండలం ) ద్వారపురెడ్డిపాలెం ( డెంకాడ మండలం ) 
సూరెడ్డిపాలెం ( కె. కోటపాడు మండలం )
ఆదిరెడ్డిపాలెం ( సబ్బవరం మండలం )

#రాయలసీమ 
````````````````````
1) #అనంతపురం_జిల్లాలో

కరిమిరెడ్డిపల్లి ( ఆమడగూరు మండలం )
లింగారెడ్డిపల్లె ( కొత్తచెరువు )
మరెడ్డిపల్లి ( గోరంట్ల మండలం )
మల్రెడ్డిపల్లె ( తనకల్లు మండలం )
ఓబులరెడ్డిపల్లి ( తలుపుల మండలం )
బుడ్డారెడ్డిపల్లి (ధర్మవరం మండలం )
రెడ్డిపల్లి (బుక్కరాయసముద్రం మండలం)
గొందిరెడ్డిపల్లి (రాప్తాడు మండలం )
నాగిరెడ్డిపల్లి (రాయదుర్గం మండలం)
రెడ్డిపల్లె (రొద్దం/ రొడ్డం మండలం )
ముదిరెడ్డిపల్లి (హిందూపురం
 మండలం )
నాగిరెడ్డి పల్లి (పుట్లూరు మండలం )
బోయరెడ్డి పల్లి ( యాడికి మండలం ) 
కాటంరెడ్డి పల్లి ( ఒడిసి మండలం ) 
మల్లిరెడ్డిపల్లి ( లేపాక్షి మండలం )

చౌదిరెడ్డిపల్లె - ముద్దిరెడ్డిపల్లె (ఈ రెండు గ్రామాలు చిలమత్తూరు మండలం )
బొజ్జిరెడ్డిపల్లె - వెంకటరెఢ్డి పల్లి ( ఈ రెండు గ్రామాలు పెనుకొండ మండలం ) 
ఎల్లారెడ్డిపల్లె - కోటిరెడ్డిపల్లి - నాగారెడ్డిపల్లె (ఈ మూడు గ్రామాలు ముదిగుబ్బ మండలం ) 

&
వీరారెడ్డి పల్లి - జంగంరెడ్డి పేట - 
రెడ్డివారిపల్లి ( తలుపుల మండలం )
 నారాయణరెడ్డి పల్లి (పుట్లూరు మండలం )
తిప్పారెడ్డి పల్లి ( యాడికి మండలం )
వెంకటరెడ్డిపల్లి ( తాడిపత్రి పక్కన )
-రెడ్డివారిపల్లి & మల్లారెడ్డి పల్లె ( కదిరి దగ్గర )
లింగారెడ్డి పల్లి - గొందిరెడ్డి పల్లి 
బాలిరెడ్డి పల్లి - ముదిరెడ్డి పల్లి ( పరిగి మండలం )

2 ) #వైఎస్సార్_కడప_జిల్లాలో 

కడప జిల్లా కు ఇప్పుడు రాజశేఖరరెడ్డి జిల్లా అనే పేరు పెట్టారు. 

లక్కిరెడ్డి పల్లి ( మండల కేంద్రం )
ఓబుళరెడ్డి పేట ( చాపాడు మండలం )
నాగిరెడ్డి పల్లె ( పెద్దముడియం మండలం )
సంజీవరెడ్డి పల్లె ( దువూరు మండలం )
నాగిరెడ్డి పల్లె (నందలూరు మండలం )
ఉమ్మారెడ్డి పల్లి ( ముద్దనూరు మండలం )
తాతిరెడ్డి పల్లె (లింగాల మండలం )
పెద్దరామిరెడ్డి గారి పల్లె (రాయచోటి మండలం )
అంకిరెడ్డి పల్లి ( వీరపునాయుని పల్లి )
నారాయణరెడ్డి పల్లి ( సంచేపల్లి మండలం )
జంగమరెడ్డి పల్లి ( సింహాద్రిపురం మండలం )
సర్విరెడ్డి పల్లె ( పొద్దుటూరు మండలం )

దాదిరెడ్డిపల్లె - ఎల్లారెడ్డిపల్లె ( ఈ రెండు గ్రామాలు కమలాపురం మండలం )
పుల్లారెడ్డిపల్లె - ముసలరెడ్డిపల్లె - రెడ్డిపల్లె ( ఈ మూడు గ్రామాలు కలసపాడు మండలం )
పోలిరెడ్డిపేట - భూమిరెడ్డి పల్లి - ఎల్లారెడ్డి పేట (ఈ మూడు గ్రామాలు గోపవరం మండలం )
నాగిరెడ్డి పల్లి - బుసిరెడ్డిపల్లి ( ఈ రెండు గ్రామాలు చింతకొమ్మదిన్నె మండలం )
సిద్దారెడ్డిపల్లె - రెడ్డివారి పల్లె ( ఈ రెండు గ్రామాలు మహారాజపురం మండలం )
కారపురెడ్డిరెడ్డి పల్లి - తిప్పిరెడ్డి పల్లి ( ఈ రెండు గ్రామాలు పెండ్లిమర్రి మండలం )
నల్లపురెడ్డి పల్లి - సింగరెడ్డి పల్లె ( ఈ రెండు గ్రామాలు పెనగలూరు మండలం )
మాచిరెడ్డిగారి పల్లె - రెడ్డివారిపల్లె (ఈ రెండు గ్రామాలు టి. సుండుపల్లె మండలం )
ఎగువరెడ్డిపల్లె - రెడ్డిపల్లె ( ఈ రెండు గ్రామాలు పుల్లంపేట మండలం )
అక్కలరెడ్డిపల్లె - ముసలరెడ్డిపల్లె -చెన్నారెడ్డి పేట (ఈ మూడు గ్రామాలు పోరుమామిళ్ల మండలం )
గంగిరెడ్డిపల్లె - పాపిరెడ్డిపల్లె - సోమిరెడ్డిపల్లె ( ఈ మూడు గ్రామాలు బ్రహ్మంగారిమఠం మండలం )
ఆదిరెడ్డిపల్లె - తిప్పిరెడ్డిపల్లె - ముదిరెడ్డిపల్లె ( ఈ మూడు గ్రామాలు మైదుకూరు మండలం )
పుల్లారెడ్డిపేట - మాచిరెడ్డిపల్లె ( ఈ రెండు గ్రామాలు వల్లూరు మండలం )
అలిరెడ్డిపల్లె - రామిరెడ్డిపల్లె - కొనిరెడ్డిపల్లి
( ఈ మూడు గ్రామాలు వేంపల్లె మండలం )
 రామిరెడ్డిపల్లి (వెంపల్లి మండలం)
గంగిరెడ్డి పల్లి (వి ఎన్ పల్లి మండలం)
రామిరెడ్డి పల్లే( పెద్ద ముడియం మండలం).

3) #కర్నూల్_జిల్లా 

రెడ్డివారి జంబులదిన్నె ( ఉయ్యాలవాడ మండలం )
 బుర్రారెడ్డిపల్లె( దోర్ణిపాడు మండలం ).
సుబ్బారెడ్డిపాలెం ( నంద్యాల మండలం )
వెంగళరెడ్డిపేట ( బండి ఆత్మకూరు మండలం )
తిప్పా రెడ్డి పల్లె(రుద్రవరం మండలం)
వీరారెడ్డి పల్లి ( శిరివెళ్ళ మండలం )
రామిరెడ్డిపల్లె (సంజామల మండలం )

&
అంకిరెడ్డిపల్లి ( కొలిమిగుండ్ల మండలం )
సుబ్బారెడ్డి పాలెం -వీరారెడ్డి పల్లె 
పాయసం రంగారెడ్డి పల్లి ( డోన్ పక్కన )
రెడ్డి పల్లి 

4) #చిత్తూరు_జిల్లా 

భైరెడ్డిపల్లి ( మండల కేంద్రం )
కలికిరి రెడ్డివారిపల్లె ( కలికిరి మండలం )
కాశిరెడ్డిపల్లె ( కంభంవారిపల్లె మండలం )
తిప్పిరెడ్డిగారి పల్లె ( చిన్నగొట్టిగల్లు మండలం )
గోవిందరెడ్డి పల్లి ( తవణంపల్లె మండలం )
అయ్యపురెడ్డి పల్లె ( పలమనేరు మండలం )
వీరప్పరెడ్డి పాలెం ( పుత్తూరు మండలం )
నాగిరెడ్డిపల్లి ( పెద్దపంజని మండలం )
మేకల నాగిరెడ్డి పల్లె ( భైరెడ్డిపల్లి మండలం )
గంగిరెడ్డిపల్లి ( రామచంద్రపురం మండలం )
సామిరెడ్డి ఖండ్రిక ( విజయపురం మండలం )
కామిరెడ్డివారి పాలెం ( సోమల మండలం )

పెద్దసామిరెడ్డిపల్లె - అయ్యల కృష్ణారెడ్డిపల్లె ( ఈ రెండు గ్రామాలు ఐరాల మండలం ) 
గంగిరెడ్డిపల్లె - రెడ్డికోట ( ఈ రెండు గ్రామాలు తంబళ్లపల్లె మండలం )
రామిరెడ్డిపల్లె - రెడ్డివారిపల్లె (ఈ రెండు గ్రామాలు చంద్రగిరి మండలం )
ఎర్రబోడిరెడ్డిపల్లె - బంగార్రెడ్డిపల్లె ( ఈ రెండు గ్రామాలు గంగాధర నెల్లూరు మండలం )
మచ్చిరెడ్డిపల్లి - రెడ్డిగారి పల్లి ( ఈ రెండు గ్రామాలు నిమ్మనపల్లె మండలం )
ఐ. రాంరెడ్డిపల్లి - బోడిరెడ్డిగారి పల్లె - రామిరెడ్డిగారి పల్లె - రెడ్డివారి పల్లె ( ఈ నాలుగు గ్రామాలు పులిచెర్ల మండలం )
తిమ్మిరెడ్డి పల్లె - వజ్జిరెడ్డి పల్లి ( ఈ రెండు గ్రామాలు పూతలపట్టు మండలం )
చిన్నమరెడ్డి ఖండ్రిక - తాతిరెడ్డి పల్లి - మోపిరెడ్డి పల్లి - సామిరెడ్డి పల్లె (ఈ నాలుగు గ్రామాలు పెనుమూరు మండలం )
పప్పిరెడ్డి పల్లి - సందిరెడ్డి పల్లె ( ఈ రెండు గ్రామాలు మదనపల్లి మండలం )
చిన్నమరెడ్డి ఖండ్రిక - బుడితిరెడ్డి పల్లి - భూమిరెడ్డి పల్లి - మాదిరెడ్డి పల్లె - సిద్దారెడ్డిపల్లె ( ఈ ఐదు గ్రామాలు యాదమరి మండలం )
అంకిరెడ్డి పల్లి - చెన్నారెడ్డి పల్లి - రెడ్డివానిపోడు ( ఈ మూడు గ్రామాలు రామకుప్పం మండలం )
ఎర్రమరెడ్డి పాలెం - చెంగారెడ్డి పల్లె ( ఈ రెండు గ్రామాలు రేణిగుంట మండలం )
నల్లపరెడ్డి యూరు - రెడ్లపల్లె ( ఈ రెండు గ్రామాలు శాంతిపురం మండలం )
పుల్లారెడ్డి ఖండ్రిక - రెడ్డిపల్లె ( ఈ రెండు గ్రామాలు శ్రీకాళహస్తి మండలం )
బసివిరెడ్డిపల్లె 1 - బసివిరెడ్డిపల్లె - 2 (ఈ రెండు గ్రామాలు శ్రీరంగరాజపురం మండలం )

&
 అండారెడ్డి పల్లి - కొండారెడ్డి పల్లె - బుచ్చిరెడ్డి పల్లె - రాఘవరెడ్డి పల్లి 
గుడ్రెడ్డి పల్లె ( మదనపల్లి దగ్గర )

#కర్ణాటక 

కర్ణాటకలో క్యాసంబెల్లి చెంగల్రాయ రెడ్డి ( KC రెడ్డి ) పేరుమీద రహదారులు వున్నాయి. 

 #తమిళనాడు 

కొడగారెడ్డి - బిధీరెడ్డి - సిన్నప్పారెడ్డిపాలెం - వర్ధరెడ్డిపాలెం - పాపిరెడ్డిపట్టి -రెడ్డియూర్ వంటి పేర్లు ఇక్కడి వివిధ ప్రాంతాలకు ఉన్నాయి.

No comments:

Post a Comment