Monday, April 15, 2024

రెడ్డి కుల నిర్ణయ చంద్రిక

ఎవరు బ్రాహ్మణులు ? ఎవరు క్షత్రియులు ? ఎవరు వైశ్యులు ? ఎవరు శూద్రులు ? అనే చర్చ ఇవాళ అవసరం లేదు . అయితే ఇవి కులాలుగా ప్రచారమవుతున్నాయి . ఇది తప్పుడు ప్రచారం . ఇవి కేవలం వర్ణాలు మాత్రమే . 
అని చెప్తున్న "రెడ్డి కుల చంద్రిక" నిజామాబాద్‌.... దోమకొండ సంస్థాన్ పాలకులచే పోషించబడిన ఒక అరుదైన చారిత్రక పుస్తకం. 

ఇటీవల సుందరాయ విజ్ఞాన కేంద్రం ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చింది.

యుగ ప్రసిద్దులైన.....
శేషాద్రి రమణ కవులు, పెద్దమందడి వెంకటకృష్ణకవి మొదలగు వారిచే రచింపబడింది.
మహాముని కావ్యకంఠ బిరుదాంకితులైన బ్రహ్మశ్రీ అయ్యల సోమయాజులు గణపతి శాస్త్రి చేత ఇది పరిశోధించబడింది .
గోలకొండ ముద్రాక్షరశాలలో 1927లో మొదటి ముద్రితం .
నెల్లూరు జిల్లా ఇందుకూరు పేటకు చెందిన శ్రీమత్పరమహంస స్వామీజీ యన్ . బి . సరస్వతిగారు / శ్రీ మాడపాటి హనుమంతరావుగారు / శ్రీ గునుపాటి నవాది రెడ్డిగారు / శ్రీ తాటికొండ తిమ్మారెడ్డి గారు / శ్రీ కంఠీరవాచార్యులవారు /గద్వాల సంస్థానవిద్వాంసులు శ్రీ పుల్లగుమ్మి వెంకటాచార్యుల వారు / శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు/ డా || కట్టమంచి రామలింగారెడ్డిగారు / శ్రీ గుండేరావు హర్కారే గారు / తిరువణ్ణమలైకి చెందిన మహాకవి శ్రీ కావ్య కంఠగణపతి మునిగారు /ఈ గ్రంథానికి అభిప్రాయాలు వ్రాశారు . పీఠికలు సంతరించి పెట్టారు .

https://archive.org/details/ srirasthu-reddikula-nirnaya-cha ndrika http://www.sundarayya.org/ saraiirasatau-raedadaikaula-nai ranaya-camdaraika

పరిచయం : తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి 

No comments:

Post a Comment