Thursday, January 3, 2019

వైస్సార్

రాలిన తారలు -1
°°°°°°°°°°°°°°°సేకరణ:తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
ఒక  ధైర్యం మరణిస్తే....
°°°°°°°°°°°°°°°°°°°°°°
యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (జూలై 8, 1949 - సెప్టెంబర్ 2, 2009)
⚘జనం మెచ్చిన నాయకుడు...
    జనం కోసం వచ్చిన నాయకుడు...
    జనమే తానై...జన ప్రభంజనమై ...
    జన జాగృతమై...జన కేతనమై...
    జయ జయ ధ్వానమై....
    రాజన్నా...ఎక్కడున్నావ్ ?
鹿గుండె గుండెలో కొలువైనావా ? గడప గడపలో నెలవైనావా ? ఇడుపు దేవరవైనావో...ఇలవేల్పు అయినావో...ప్రతి ఇల్లు నిను పూజిస్తున్నది.ప్రతి హృదయం నిను శ్వాసిస్తున్నది.
జయహో రాజన్నా...! జహహో...! ఈ ప్రంపంచం నశించినా నీ కీర్తి మిగిలి ఉంటుంది ! ఏ వ్యవస్థ కూలినా నీ త్యాగం బతికి ఉంటుంది. అఖండ శిఖరానివి....అసేతు హిమాచలానివి ! రా ... జనం పిలుపు అందుకుని....మృత్యు వాకిలి దాటుకుని...తిరిగిరా ...!!
అతిరథ మహారథుడివో...
తథాగథుడివో...కారణజన్ముడివో...
రా..! కదలిరా !
పున:రాగమనమై...
పున:రంకితమై...!!
***
      ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి...  ఇందిరా కాంగ్రస్ పార్టీ నాయకుడు...రైతు బాంధవుడు...పేదల బంధువు...స్వర్ణయుగ ప్రదాత Y.S.రాజశేఖర్ రెడ్డి
1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టి, ఓటమి ఎరుగని జన సంకేతమై  మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికయ్యాడు. తర్వాత తన సేవల్ని విస్తరించుకుంటూ  కడప లోక్‌సభ నియోజకవర్గంనుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు.  4 సార్లు వరుసగా ఖండ విజయం సాంధించాడు.
      జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన తొలి ఎన్నికల (1978) వెంటనే మంత్రిపదవి పొందాడు. ఆ తర్వత రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు. 1999లో   ప్రతిపక్షనేతగా  తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించి.... 2003లోమండువేసవిలో 1460 కిలోమీటర్లు   పాదయాత్రను ఒక సాహస యాత్రగా కొనసాగించాడు.      ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరచింది. అట్లా 2004 ఎన్నికలలో  ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది.
         జననేత 1949 జూలై 8 న వైఎస్ఆర్ జిల్లా, జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించాడు.  తల్లి జయమ్మ , తండ్రి రాజారెడ్డి.  తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టరుగా పనిచేస్తుండటం వల్ల వై.యస్. పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది.  తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చదివాడు. ఆ తర్వాత గుల్బర్గాలో మహాదేవప్ప రాంపూరే వైద్య కళాశాలలో వైద్యవృత్తిని అభ్యసిస్తుా  కళాశాల విద్యార్థిసంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు.  1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్యవిద్యలో పట్టా సాధించాడు.విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖరరెడ్డి యెస్.వి.ఆర్.ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్‌సర్జన్ సంఘం అధ్యక్షుడిగా కూడా  ఎన్నికయ్యాడు.
        కొద్దిరోజులపాటు జమ్మలమడుగులో  సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశాడు. ఆ తరువాత 1973లో పులివెందులలో తండ్రి వై.ఎస్.రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 పడకల ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశాడు. ఒక్క రూపాయి డాక్టరుగా వీరి సేవలు గణనీయమైనవి.
        వై.యస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ..కుమారుడు జగన్మోహన్ రెడ్డి , కూతురు షర్మిళ గురించి పరిచయం అవసరం లేదు.
          సెప్టెంబర్ 2, 2009 న మన ప్రియతమ నేత హెలికాప్టర్ ప్రమాదంలో  చనిపోయాడు. వీరి మరణాన్ని తట్టుకోలేక వందలాది గుండెలు ఆగిపోయాయి.
      ఒక వీరుడు మరణిస్తే వేలకొలది ప్రభవిస్తారు....
      ఒక దేవుడు కరుణిస్తే కోట్లకొలది కదిలొస్తారు...

No comments:

Post a Comment