Friday, October 12, 2018

పాట


✍🏿తంగెళ్ళశ్రీదేవిరెడ్డి

పల్లవి: కరీం నగరు ముద్దుబిడ్డ
        క్రమశిక్షణ వీడి అడ్డ
        చిరునవ్వే ఆయుధమై
        సమరానికి సాయుధమై
        ప్రత్యర్థికి ముచ్చెమటై
        గర్జించిన పులిబిడ్డై
 అన్నొస్తున్నాడదిగో ఆపద్భాంధవుడై....
    కోరస్:    నిస్వార్థుడు చరితార్థుడు
      ప్రభకరన్న  మన ఆప్తుడు
      కాంగ్రేసుకు తోడయ్యే
     మనకేమో నీడయ్యే......
     జనం జనం ప్రభంజనం
     నిజం నిజం  ఇదినిజం
      దళం దళం జన దళం
చరణం 1: చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై
పేదల గుండెల్లో ఆశలు నింపుటకై.....
జనగళమే తన బలమై
జనహితమే తన మతమై.....
ప్రభవించిన సంభవమై
ప్రజా సంకల్పమై....

అన్నొస్తున్నాడదిగో ఆపద్భాంధవుడై...
  కోరస్: త్యాగధనుడు కార్యఘనుడు
               ప్రభాకరన్న మన మిత్రుఢు
          రాహుల్ కు కుడిభుజమై
         మనకేమో    ఒడివిధమై....
    జనం జనం ప్రభంజనం
        నిజం నిజం  ఇదినిజం
      దళం దళం జన దళం
చరణం 2: తెలంగాణ  రాష్టాన మన జెండా ఎగురుటకై
        సోనియమ్మ  నజరాన అందరికీ చేరుటకై.....
       అవినీతిని కడిగేస్తూ
       అడుగుల్లో అడుగేస్తూ.....
         మంచికొరకు  స్వరమెత్తి
          చీడలపై  శివమెత్తి....
     అన్నొస్తున్నాడదిగో ఆపద్భాంధవుడై
      కోరస్:    ప్రియతముడు ఉత్తముడు
         ప్రభాకరన్న  మన జనుడు
             హస్తానికి     జై కొట్టే
          మనకేమో  సై  చెప్పే
         జనం జనం ప్రభంజనం
        నిజం నిజం  ఇదినిజం
      దళం దళం జన దళం
చరణం 3:రాక్షసపాలనలో రుధిరం  ఆపుటకై
కీచకపర్వంలో కుట్రలు తొలగుటకై....
విలువలను పాటిస్తూ
చేయూతను అందిస్తూ....
రాష్ట్రానికి రక్షకుడై
జగమంతా సైనికుడై...
అన్నొస్తున్నాడదిగో ఆపద్భాంధవుడై...
కోరస్: విరిగుత్తి పిడికత్తి 
ప్రభాకరన్న మన కీర్తి
పార్టికి విలువిచ్చి
మనకేమో బతుకిచ్చి.......
జనం జనం ప్రభంజనం
        నిజం నిజం  ఇదినిజం
      దళం దళం జన దళం
చరణం4:ఎండిన భూముల్లో మొలకల
 ఊసులకై
అలసిన మనసుల్లో ఆసర నింపుటకై....
ప్రతి ఊరు తనదంటూ
ప్రతి ఇల్లూ తానంటూ....
కదిలొచ్చిన జనరథమై
నిలువెత్తూ జనపథమై....
అన్నొస్తున్నాడదిగో ఆపద్భాంధవుడై
కోరస్:రవితేజం రణశౌర్యం
   ప్రభాకరన్న మన ధైర్యం
     తెలంగాణ సారథియై
మనకేమో వారధియై.....

జనం జనం ప్రభంజనం
        నిజం నిజం  ఇదినిజం
      దళం దళం జన దళం..

బతుకమ్మ పాట


రచన :తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి
*ఆశ్వయుజ మాసం ఉయ్యాలో...
పచ్చని  ప్రకృతి  ఉయ్యాలో...
*పువ్వులు కాయలు  ఉయ్యాలో..
పులకింత నవ్వులు ఉయ్యాలో...
*సూర్య చంద్రులు ఉయ్యాలో...
సంచారం  జెయ్యంగా ఉయ్యాలో...
*బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...
అందాల బతుకమ్మ ఉయ్యాలో....
*ఇంటింటి కొచ్చింది   ఉయ్యాలో....
ఇలవేల్పు అయ్యింది ఉయ్యాలో...
*ఐక్యమత్యము ఉయ్యాలో...
అందరికి పంచింది ఉయ్యాలో..
🌻పెత్తరమాస ఉయ్యాలో...
పెద్దకూతురు ఉయ్యాలో..
*ఎంగిలి పూల బతుకమ్మ ఉయ్యాలో...
అరుదెంచినాదమ్మ ఉయ్యాలో...
*నువ్వులు నూకలు ఉయ్యాలో...
బెల్లం బియ్యం ఉయ్యాలో...
*ఆడబిడ్డలు  అందరు ఉయ్యాలో...
నైవెద్యం పెట్టంగా ఉయ్యాలో.....
* దిక్కుల్లో కొలువై ఉయ్యాలో
దీవించు తల్లీ ఉయ్యాలో
🌻 పాడ్యమి నాడు ఉయ్యాలో...
రెండో కూతురు ఉయ్యాలో...
*అటుకుల బతుకమ్మ ఉయ్యాలో...
అలికిడి జేసింది  ఉయ్యాలో...
*సప్పిడి పప్పు ఉయ్యాలో..
బెల్లం అటుకులు ఉయ్యాలో...
*ఊరంత కలిసి  ఉయ్యాలో...
ఉమ్మడిగా పెట్టిరి ఉయ్యాలో...
*మంచిని నిలుపమ్మా  ఉయ్యాలో
మనిషిని కాపాడ ఉయ్యాలో...
🌻 విదియ రోజున ఉయ్యాలో...
మూడో కూతురు ఉయ్యాలో...
*ముద్దపప్పు బతుకమ్మ ఉయ్యాలో
మురిసి ఆడింది ఉయ్యాలో...
*పాలు బెల్లం ఉయ్యాలో...
పరమాన్నం వండి ఉయ్యాలో...
*వెండి గిన్నెల్లో ఉయ్యాలో...
వేడుక జేసిరి ఉయ్యాల్లో...
*లోక కళ్యాణం ఉయ్యాలో...
నీ పాద ముద్రలు ఉయ్యాలో...
🌻తదియ దినమున ఉయ్యాలో...
నాలుగో కూతురు ఉయ్యాలో...
*నానే బియ్యం బతుకమ్మ ఉయ్యాలో...
నట్టింట నిలిచింది  ఉయ్యాలో....
*బియ్యం నానేసి ఉయ్యాలో...
పాలు పంచదార ఉయ్యాలో...
*పిల్లలు పెద్దలు ఉయ్యాలో...
ప్రేమగా పెట్టిరి ఉయ్యాలో...
*పగలు పంతాలు ఉయ్యాలో...
తొలగించు నా తల్లీ ఉయ్యాలో...
🌻  చక్కని చవితి ఉయ్యాలో...
ఐదో కూతురు ఉయ్యాలో...
*అట్ల బతుకమ్మ ఉయ్యాలో..
అబ్బుర పరిచింది ఉయ్యాలో...
*దోశలు వెయ్యంగా ఉయ్యాలో...
దోస్తీ పెరిగింది  ఉయ్యాలో....
*నిండు మనసులు ఉయ్యాలో...
నిన్ను జేరంగా ఉయ్యాలో...
*దోషాలు తొలగించి ఉయ్యాలో...
దేశాన్ని కాపాడు ఉయ్యాలో....
🌻పంచమి పంచన ఉయ్యాలో...
 ఆరో కూతురు ఉయ్యాలో...
*అలిగిన బతుకమ్మ ఉయ్యాలో...
 చప్పుడు లేదమ్మా ఉయ్యాలో...
* పూలన్నీ చినబోయి ఉయ్యాలో...
ఊరంతా మూగబోయి ఉయ్యాలో...
*తంగేడు వనమంతా ఉయ్యాలో
తల్లీ నిన్ను తలవంగా ఉయ్యాలో...
*గునుగు తోటలు ఉయ్యాలో...
అమ్మా నీ కొరకు ఉయ్యాలో...
* స్వచ్చంగా వేచింది ఉయ్యాలో...
చల్లంగా రావమ్మ ఉయ్యాలో....
🌻 షష్ఠి తిథి ఉయ్యాలో...
ఏడో కూతురు ఉయ్యాలో...
*వేపకాయల బతుకమ్మ ఉయ్యాలో...
వెలుగులు తెచ్చింది ఉయ్యాలో...
*బియ్యం గోధుమలు ఉయ్యాలో...
 చక్కెర కుడుములు ఉయ్యాలో...
*ఆడపిల్లలు  ఉయ్యాలో...
అందించి మొక్కిరి ఉయ్యాలో....
*మమతానురాగాలు ఉయ్యాలో...
వరమివ్వు తల్లీ ఉయ్యాలో....
🌻 సప్తమి సందిట ఉయ్యాలో...
ఎనిమిదో కూతురు ఉయ్యాలో
*వెన్నముద్దల బతుకమ్మ ఉయ్యాలో...
వెచ్చని ఒడి పంచి ఉయ్యాలో...
*వెన్న నెయ్యి ఉయ్యాలో...
మీగడ నురగలు ఉయ్యాలో...
* కలిసి మెలిసి ఉయ్యాలో...
కడవల్లో దెచ్చిరి ఉయ్యాలో...
*కలిమిని నిలిపి ఉయ్యాలో...
లేమిని మాపమ్మ ఉయ్యాలో....
🌻అష్టమి పొద్దున ఉయ్యాలో...
తొమ్మిదో కూతురు ఉయ్యాలో....
*సద్దుల బతుకమ్మ ఉయ్యాలో...
 సందడి జేసింది  ఉయ్యాలో....
*కొబ్బరి తురుము ఉయ్యాలో...
కోరికలు తీరంగా ఉయ్యాలో...
*నూగుల అన్నం ఉయ్యాలో...
నచ్చిన పెనిమిటి ఉయ్యాలో...
*చింత పండు ఉయ్యాలో....
చింతలు దీరంగా ఉయ్యాలో...
*కలగూరలు అన్నీ ఉయ్యాలో...
 కోపాలు కరుగంగా  ఉయ్యాలో
*పులగం బువ్వ ఉయ్యాలో...
రొట్టెల మాలీజ ఉయ్యాలో....
అన్నదమ్ములు ఉయ్యాలో...
అక్కజెల్లెళ్ళు ఉయ్యాలో...
కలిసి మెలిసి ఉయ్యాలో...
కలకాలం ఉండాలి ఉయ్యాలో...
🌻యాడాది కోసారి ఉయ్యాలో...
తొమ్మిది రోజులు ఉయ్యాలో...
*తీరుగా కొలువై ఉయ్యాలో...
తీరొక్క పూల ఉయ్యాలో...
* సంస్కృతి నీవు ఉయ్యాలో...
ప్రాచీన కథవు ఉయ్యాలో....
* తెలంగాణ తల్లీ ఉయ్యాలో...
అందరి దానివి ఉయ్యాలో...
*పారేటి నీళ్లల్ల ఉయ్యాలో...
పోయిరావమ్మ ఉయ్యాలో...
*పూల నెనరు ఉయ్యాలో...... .
దండాలు మా తల్లీ ఉయ్యాలో...
దయగల మాతల్లి ఉయ్యాలో...