Thursday, January 3, 2019

పపాలు 1 ( నా మినీ కవితలు )

తెలుగు సాహిత్య వచనా ప్రక్రియల్లో భాగంగా ఎన్నో లఘు ప్రక్రియలు పురుడుపోసుకున్నాయి.సాహిత్య విస్తృతిలో ఈ ప్రక్రియలు ప్రతిష్టాత్మకమైన పాత్రను పోషించాయి...పోషిస్తున్నాయి..!ఈ క్రమంలో భాగంగా ఎందరో యువకవులు తమ ఆలోచనాశైలికి పదనుపెట్టి నూతన ఒరవడులతో తెలుగు సహిత్య పరిధిని మరీంత విస్తృత పరుస్తున్నారు.ఇది విప్లవాత్మకమైన తరుణం.ఇందులో భాగంగా నేను '' పపాలు '' అనే నూతన లఘు కవితా ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది.పదానికి పాదాన్ని సమకూర్చడమే పపాల ప్రత్యేకత! పదం 5 అక్షరాలకు మించవద్దు.పాదం 20 అక్షరాలకు మించవద్దు.మొదట అకారాది క్రమంలో రాయాలనుకున్నను.కానీ జంట పదాలకు భంగం వాటిల్లుతున్న క్రమంలో ఈ ఆలోచనను విరమించుకున్నాను. ఇతివృత్తంతో సానుకూలమే అనిపించింది.కాని ప్రాసకలిసే పదాల క్రమాన్ని కొల్పోయే అవకాశం కనిపించింది.కాబట్టి ఇందుకు కూడా విముఖత చూపి పదాల మేలు కలయికతో అర్థవంతంగా మాత్రమే పపాలు సృష్టించే పనికి పూనుకోవడం జరిగింది.అనుసరించే వాళ్ళకు ఆహ్వానం...!
ఆశీర్వదించే వాళ్ళకు అభివందనం!!
పపాలు...
-----------
అమ్మ..
నిర్వికారుడి నిజస్వరూపం !
***
నాన్న...
నీ అనే రాజ్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు !
***
ప్రేమ..
మనసు ఎక్కుపెట్టిన మన్మధ విల్లు
***
ప్రేయసి...
మనసు గడీని పాలించే దొరసాని !
***
చెలికాడు..
చెలియ కప్పుకున్న  చలి దుప్పటా !
***
అందం..
వయసు వరదలో కొట్టుకు పోయే చెత్త !
***
వయసు..
బతుకును అరగదీసే బద్ద శత్రువు !
                     ✍శ్రీదేవి రెడ్డి

No comments:

Post a Comment