Thursday, January 3, 2019

కులాంతర వివాహాలు???? (విశ్లేషణ )

ఇక్కడ నేను చెప్పిన కులం ఒక జాడ్యం కాదు.కుల జాడ్యం వేరు.కుల పిచ్చి వేరు.కుల గజ్జి వేరు.నేను సర్వమత..కుల..ప్రేమికురాలిని.కాని నాకంటూ వుండే ఒక నీడ...ఒక తోడు...ఒక గుర్తింపు...ఒక  గౌరవం..ఒక ఆర్తి...ఒక స్పూర్తి...ఇవన్నీ ఈ కులం పరిధిలోనే వున్నాయని భావిస్తాను.ఇటీవలి కాలంలో  టివి9 వాళ్ళు ''కులాంతర వివాహాలతో అందమైన సంతానాన్ని పొందండీ' అని ప్రచారం చేస్తుంటే అది చూసి ఎంతోమంది తల్లిదండ్రులు భయపడి పోయారనేది వాస్తవం.ఇలాంటి ప్రకటనలు..ప్రచారాలు..మనం వున్న జీవన పరిస్థితుల్లో అవసరం లేదు.మతోన్మాదం ఎంత భయంకరమో  కులోన్మాదం కూడా అంతే భయంకరమైనది.కానీ కులం అనేది ఒక గృహం.ఇక్కడ శాంతి  మనశ్శాంతి అవసరం.ఈ పరిధులు అతిక్రమిస్తే  ఇవన్నీ నిర్వీర్యం అవుతాయి.గాలి వానల్ని అన్ని చెట్లూ తట్టుకోలేవు.కొన్ని ఆదర్శాలనూ కొన్ని కుటుంబాలు భరించలేవు.ఈ క్రమంలో 'కులం'  అనేది మన ఆత్మాభిమానం!అంతే తప్ప ఇదొక ఎక్కువతక్కువల నిర్వచనం కాదు.కులం గడప దాటితేనే అందమైన పిల్లలు పుడుతారనేది హాస్యాస్పదం.యువత ఈ నిజం తెలుసుకోవాలి.మనది సెక్యులర్ సమాజం.ఇక్కడ వ్యవస్థ మారాలంటే అది అంత సులువు కాదు.

No comments:

Post a Comment