Thursday, January 3, 2019

చిగురించిన శిశిరం (కథ )

చిగురించిన శిశిరం  (కథ)
....................................✍తంగెళ్ళశ్రీదేవిరెడ్డి
నాపేరు నరసింగయ్య.ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లెక్కల టీచర్ గా పనిచేస్తుంటాను➕➖➗✖.నాకు కొంచం కోపం ఎక్కువ.ఈ కారణంగా అందరూ నన్ను ఉగ్రనరసింహం అని చాటుగా చెప్పుకుంటుంటారు.ఎదురుగా మాత్రం వినయం ప్రదర్శిస్తుంటారు.కాబట్టి ఎవ్వరు ఏ విధంగా  నా గురించి మాట్లాడుకున్నా నేను పట్టించుకోను.చెప్పాలంటే పట్టించుకునే ఓపికా తీరికా నాకు లేవు.
     నాకు ఇద్దరు పిల్లలు.అమ్మాయి పేరు సరస్వతి.8 వ తరగతి చదువుతోంది.అబ్బాయి హయగ్రీవ. 10 వ తరగతి చదువుతున్నాడు.నా పిల్లల పేర్లను  చూసి చాలా మంది  'చదువుల దేవుళ్ళను ' ఇంటికే తెచ్చుకున్నావు అంటూ కితాబు ఇస్తుంటారు. వాళ్ళ పొగడ్త సంగతి ఏందో గానీ నిజంగా కూడా నా పిల్లలు చదువుల తల్లులు磊賂雷.ఏదైనా ఇట్టే పట్టేస్తారు.బట్టీయం  వాళ్ళకు ఆమడ దూరం.ఇది  తండ్రిగా నాకు ఎంతో గర్వకారణం.బయటకు చెప్పను గానీ నాలో నేను  చాలాసార్లు ఇట్లా  అనుకుంటాను..
'రాయలవారి తిమ్మరుసులా నా పిల్లలు కూడా ఏకసంథాగ్రహులు.ఇది నిజంగా నా అదృష్టం' 珞!!
   ఇట్లా   నా పిల్లల గురించి నేను ఎంతో గర్వపడ్తాను.కానీ ఇది నా పిల్లలకు తెల్వదు.తెల్వనివ్వను కూడా.తెలిస్తే వాళ్ళల్లో సుపీరియారిటి కాంప్లెక్స్ పెరిగి అస్సలుకు మోసం వస్తే  కష్టం అని నేను అంతర్ముఖుడిగా ఉండిపోతాను.నా పిల్లల విషయంలోనే కాదు,నా విద్యార్థుల వద్ద కూడా నాది ఇది తీరు.అభినందిచాల్సి వస్తే మాత్రం 'సాధించింది గోరంత...సాధించాల్సింది కొండంత!మే గాడ్ బ్లెస్ యూ 駱 'అని మనస్పూర్తిగా ఆశిర్వదిస్తాను.కానీ నా తీరు చాలా మందికి నచ్చదు.పొగడ్తలతో ముంచెత్తుతేనే వాళ్ళకు నచ్చుతుందని నాకు తెలుసు.కానీ వాళ్ళ తీరు నాకు నచ్చదు కదా!
   వాసన చూసి వదిలిపెట్టాల్సిన పరిమళాలు పొగడ్తలు鹿.నా విషయంలో కూడా నాది ఇదే అభిప్రాయం.కాబట్టి ఎవ్వరైనా నన్ను ఏదైనా విషయంలో పొగిడితే ఆ అనుభూతిని మనసారా ఆస్వాదిస్తాను తప్ప...ఇక నాకు ఎదురులేదు-నాకు అంతా తెలుసు....నేనోక బుడింగిని ...అనే ధోరణిలో మాత్రం వెళ్ళను.ఇతరులు కూడా ఇట్లాగే ఉండాలనుకుంటాను.ఈ సోదంతా పక్కకు పెడితే నాకంటూ ఒక గోల్ వుంది.అది ఏందంటే నాతో చదివిన ప్రతి విద్యార్థి కచ్చితంగా ప్రయోజకులు కావాలి.ఎవ్వరూ కూడా అసహాయులుగానో నిస్సహాయులుగానో మిగిలి పోకూడదుఅని.కబట్టే వీలు దొరికినప్పుడల్లా ఇంట్లో నా పిల్లలకూ బడిలో పిల్లలకు నీతివాక్యాలు భోధిస్తుంటాను..ఇందుకు పిల్లలంతా నన్ను సుత్తి మాస్టారు అని  ⛏ చాటుగా మాట్లాడుకుంటారనే సంగతి   నాకు తెల్వందికాదు.ఇంట్లో అయితే నా పిల్లలు నన్ను తప్పించుకుతిరిగే ప్రయత్నాలు చేస్తుంటారు.ఇవన్నీ నాకు చీకాకు కోపం తెప్పిస్తుంటాయి.ఈ క్రమంలో చాలాసార్లు సహనం కొల్పోతాను..పెద్ద పెద్దగా కేకలేస్తాను.
    ఒకరోజు....నేను లీజర్ పీరియడ్ లో మోరల్ వాల్యూస్ గురించిన ఆంగ్ల పుస్తకం ఒకటి చదువుతూ బడి ముందున్న కానుగ చెట్టు నీడలో కుర్చిలో కూర్చుని వున్నాను.మార్చి నెల కావడంతో ఎండలు ఒక మోస్తరుగా పెరగడంతో☀️ కొన్ని తరగతుల పిల్లల్ని కూడా అక్కడక్కడున్న చెట్లకింద కూర్చో బెట్టుకుని పాఠాలు చెప్తున్నారు టీచర్లు.ఇంతలో నన్నెవరో పిలిచినట్టుగా అనిపించింది.
    ' సార్ '
నేను ఎవ్వరా అన్నట్టుగా తలెత్తి చూసాను.10 వ తరగతి విద్యార్థి ఒకడు నాకు ఒకింత దూరంలో నిల్చుని వున్నాడు.వాడి ముఖంలో నా మీది భయం తాలూకు చాయలు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి.
  'ఏం కావాలి? ' వాడి భయాన్ని పట్టించుకోకుండా నాదైన తీరులో అడిగాను.
' సార్ హింది టీచర్ రాలేదు.సోషల్ చదువుకోమని హెడ్మాస్టర్ సార్ చెప్పింఢు.కానీ పిల్లలు ఒక్కరు గూడా పుస్తకం పట్టుకోలేదు.ఎవ్వరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అల్లరి జేస్తున్నరు...'పిర్యాదుగా చెప్పాడు.అందుకు నేను వస్తాను పదా అన్నట్టుగా తలాడించాను.కంగారుగా వచ్చినవాడు కాస్తా ప్రశాంతగా వెళ్ళిపోయాడు. నేనైతేనే అల్లరి మూకల్ని అణచగొడ్తాననే ధీమా వాడి అణువణువున ఉందని నేను ప్రత్యేకంగా మననం చేసుకోవాల్సిన అవసరం లేదు.అది వాడు ఒక్కడికే కాదు, బడిలో ప్రతి ఒక్కరి ధీమా అదే!
     ఓ రెండు నిముషాల తర్వాత నేను 10 వ తరగతి వైపు నడిచాను.నా రాకను గమనించి ఎక్కడి పిల్లలు అక్కడ గప్ చుప్ అయ్యారు.ఇందుకని నేను ఊరుకోలేదు.
  'సిగ్గూ బుద్దీ ఉందా మీకూ!? టీచర్లు ఎదురుగా వంటేతప్ప చదువు కోవడం చాత కాదా? దద్దమ్మల్లారా..' అని గట్టిగా అరిచాను.అంతలో నా దృష్టి వెనక బేంచీలో కూర్చుని వున్న ఓ పిల్లగాడి మీద పడింది.వాడు నేను మాట్లాడుతుంటే నా మాటలు వినకుండా బయట ఎక్కడో చూస్తున్నాడు.అంతే! నా కోపం నషాలానికి అంటింది.
   ' ఏరా వెధవా...నేను ఇప్పుడు ఏం మాట్లాడానో చెప్పరా 'అంటూ వాడి వైపు నడిచాను.వాడు గజా గజా వణికి పోతూ లేచి నిల్చున్నాడు.నేను వెనకా ముందు ఆలోచించలేదు.వాడి చెంపమీద గట్టిగా ఒక్కటి ఇచ్చుకున్నాను臘‍♂️.ఆ దెబ్బకు వాడు బిత్తరపోయాడు.వాడికి అది అవమానంగా కూడా తోచినట్టుంది.బాధను పంటి బిగువన అదిమి పట్టుకుని తరగతి గదినంతా ఒకసారి కలియజూసాడు.ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నవైపు‍♀️‍♀️‍♂️擄.
      నేను వాడి మనసును చదివానే తప్ప వాడి బాధను అర్థం చేసుకోలేదు.అందుకే వాడితో బింగీలు ‍♂️‍♀️ కూడా తీయించాను.ఊహించని పరిణామానికి వాడే కాదు...తరగతి అంతా నిశ్శబ్దం అయ్యింది.ఇక నేను ఆ బెల్ అయ్యే వరకు ఆ తరగతిలోనే కూర్చుని  ఆ తర్వాత వెళ్ళిపోయాను.నేను ఉన్నంత సేపు తరగతిలో ఒక్కరూ కిక్కురు మనలేదు.' భయం అంటే ఇట్లా ఉండాలి.లేదంటే ...అమ్మో...అదుపు చేయలేము ' అని పిల్లల్ని చూస్తూ నా మనసులోనే నేను అనుకున్నాను.అంతేతప్ప నేను చిన్న విషయానికే పెద్ద దెబ్బ కొట్టిన పిల్లవాడి గురించి మాత్రం ఇసుమంత గూడా ఆలోచించలేదు.
      సాయంత్రం ఇంటికి వెళ్లాక  మరుసటి రోజు ఆదివారం కాబట్టి అలా బయటకు వెళ్దాం అనే ఆలోచన వచ్చింది.సహజంగా ఎప్పుడో తప్ప బయటకు వెళ్ళేది వుండదు.కాబట్టి విషయం తెల్సి భార్యాపిల్లలు ఎంతో సంతోషించారు藍. వాళ్ళ సంతోషాన్ని  మనసారా నాలో నేనే తృప్తి పడుతూ ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరాన వున్న అమ్మవారి గుడికి వెళ్ళాము.మాది అటు పల్లే ఇటూ పట్నమూ కాకుండా తన అందాన్ని కొల్పోయిన ఎటూగాని ఊరు.ఇక్కడ ప్రత్యెకమైన కట్టడాలు గాని ప్రదేశాలు గానీ లేవు.ఊరందరికీ అమ్మవారి ఆలయమే ఓ పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు...ఓ పర్యాటక ప్రాంతంకూడా! ఎందుకంటే ఎత్తయిన కొండమీద వుండే ఆలయ పరిసరాలు అంత బాగుంటాయి మరి!
        గుడికి అట్లా వెళ్ళామో లేదో ఇట్లా నా బిడ్డ తన స్నేహితురాలు ఒకరు కలిస్తే మమ్మల్ని వదిలి తన వెంట వెళ్ళింది. కొచం సేపు మాట్లాడి వస్తుందేమో అనుకున్నాను కానీ రాలేదు.పూర్తిగా ఆ అమ్మయితోనే వుండి పోయింది.ఇదినాకు కోపం తెప్పించింది.అంతే...దగ్గరగా వెళ్ళి గట్టిగా చివాట్లు పెట్టాను. గుడికి వచ్చిన వాళ్ళంతా తిరిగి చూసారు.అదో వినోదంగా వింటూ నిలబడి పోయారుకూడా.ఇందుకు నా బిడ్డ ఒకరకమైన అవమానభారంతో తలొంచుకుని నిలబడిపోయింది.తిడుతున్నది తండ్రి కాబట్టి కక్కలేక మింగలేక తన బాధను ఎదుటి వాళ్ళకు తెలియనివ్వకుండా తెగ జాగ్రత్త పడుతూ లేని చిరునవ్వుని పెదవులపై పులుముకోవాలని చూసింది.కానీ తనకు అది సాద్యం కాలేదు.ప్రతిఫలంగా తన కళ్ళల్లో ఓ ఎర్రని కన్నీటి జీర!
        సోమవారం బడికి బయలుదేరాను.కాని అనుకోకుండా దారి మద్యలో నాకు తెల్సిన ఒకతను కళ్ళు తిరిగి కిందపడిపోయి ఉన్నాడు.అది చూసి హడావిడి పడుతూ ..అతడ్ని ఆసుపత్రికి పంపించేసరికి  .స్కూల్ టైం అయిపోయింది.మానవత్వానికంటే మించింది ఏముందని? అయినా ఇట్లాంటి విషయాల్ళో టైం పంక్చువాలిటి కంటే ⏰⌚ప్రాణాలు ముఖ్యం కబట్టి ఎలాంటి కంగారు లేకుండా ...కాపాడిన వ్యక్తికి ప్రాణాపాయం కూడా లేదు కాబట్టి  గుండె నిండిన తృప్తితో స్కూటర్  స్టార్ట్ చేసుకుని  బయలుదేరాను.
     నేను వెళ్ళేసరికి హెడ్మాస్టర్ ఏ మూడ్ లో వున్నాడో ఏమో తన సీట్లో తలపట్టుకుని కూర్చున్న వాడల్లా ఒక్కసారిగా నన్ను చూసి 'అందరికీ నీతులు చెప్తారు కదా...మీ నీతి ఏమయ్యింది?' అంటూ ఒక్కసారిగా నాపై విరుచుకుపడ్డాడు.ఊహించని తీరుకు నేను ఉలిక్కిపడ్డాను.樂.అందరిని హడలెత్తించే నాపైనే తిరుగుబాటు జరగ్గానే అక్కడే ఉన్న తోటి ఉపాధ్యాయులు స్తంభించిపోయారు.ఎవ్వరూ ఏం మాట్లాడకుండా చోద్యం చూడ్డ మొదలెట్టారు.అట్లా జీవితంలో తొలిసారిగా పరాభవం ఎదురయ్యింది.అందుకు నేను హెడ్మాస్టర్ని ఎదురించి కూడా మాట్ల్లాడలేకపోయాను.ఇందుకు కారణం నా నిస్సహాయత కాదు.నా కోపం  అవమానం ముందు చచ్చి పోవడం కాదు.ఊహించని పరిస్థితికి నా మెదడు కాసేపు అలా మొద్దు బారి పోవడమే!!
      అట్లా ఒక గంట గడిచింది.నేను అంతసేపూ నిశ్చలంగా ఉండిపోయాను.ఆ తర్వాతే నాలో మెల్లగా కదలిక మొదలయ్యింది.ఇక నేను ఆగలేదు.వెంటనే స్టాఫ్ రూంలోకి వెళ్ళాను.హెడ్మాస్టర్ ని నిలదీయబోయాను.అందుకు అతడు అవకాశం ఇవ్వకుండా ...' క్షమించండి సార్.నేనున్న పరిస్థితిలో అట్లా మాటాడాను.అది పద్దతి కాదు.మీ ఒక్కరి విషయంలోనే కాదు వేరే ఎవ్వరి విషయంలో కూడా అది మంచి పద్దతి కాదు.తప్పుంటే పర్సనల్ గా పిలిచి మాట్లాడాలి.అది సంస్కారం.అంతేగానీ పదిమందిలో నోరుపారేసుకుని ఎదుటి వాళ్ళు అవమాన భారంతో చచ్చిపోతుంటే అది మన పెద్దరికంగానో...మనకున్న అధికారంగానో...మనకు పెరుగుతున్న గౌరవంగానో చెలరేగిపోవద్దు.కానీ నేను ఈరోజు మీ విషయంలో కారణాలు కూడా తెల్సుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాను.ఇందుకు మనసులో ఏం పెట్టుకోవద్దు.ఐయాం వెరీ సారీ欄'అంటూ పాశ్చాత్తాపపడిపోయాడు.దీంతో నేను మరి మాట్లాడలేకపోయాను.అతడి ముందు అట్లాగే నిశ్శబ్దంగా కూర్చుండిపోయాను.మళ్ళీ అతడే కల్పించుకుంటూ....
      'నాకు నిజంగా చాలా బాధగా వుంది సార్!ఇంటి వద్ద నా భార్యను బంధువుల ఎదురుగా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాను.ఎవ్వరికైనా ఎలాంటి వాళ్ళకైనా విలువలు అనేవి ఉంటాయి.మన అధికారాన్ని ప్రదర్శిస్తూ ఆ విలువల్ని మనం కించపర్చకూడదు.ఈ బాధలో వుండి మిమ్మల్ని కూడా అనేసాను.ఏ తప్పు చేయకూడదని బాధపడ్తున్నానో మళ్ళీ అదే తప్పు చేసి బాధను రెట్టింపు చేసుకున్నాను.నిజం సార్! మీకూ నాకే కాదు...ఇంట్లో ఆడవాళ్ళకూ  బడిలో పిల్లలకు వాళ్ళ వాళ్ళ పరిధిలో కొన్ని విలువలు బిడియాలు ఉంటాయి.వాటిని మనం అర్థం చేసుకోవాలి....'అని చెప్పుకు పోతుంటే నాలో  అతడిపై తచ్చర్లాడుతున్న ఒకరకమైన ద్వేషమో మరేదో తెలియట్లేదు కానీ అదంతా తెరలు తెరలుగా నా ప్రమేయం లేకుండానే విడిపోసాగింది.
   'మోరల్ పుస్తకాలు చదివి కూడా తెలుసుకోలేని ఒక చిన్న జ్ఞానం ' అతడి మాటల్లో బోధపడ్తుంటే...విచక్షణ కొల్పోయి ప్రవర్తించే నా కోపం నన్నే ఆ క్షణాన ప్రశ్నించడం మొదలెట్టిది...!
     నిజమే కదా!!
పిల్లలకూ మనసు వుంటుంది కదా!!?
తప్పు చేస్తే సౌమ్యంగా చెప్పాలి కదా!!?
లేదా పక్కకు పిలిచి చెప్పాలికదా!!?
అంతే..!
ఇక నేను అక్కడ కూర్చోలేదు.బయటకు నడిచాను.నాకు కొడంత గౌరవాన్ని మర్యాదను అందించిన పాఠశాల భవనం నా కళ్ళకు ఓ అత్మీయ సదనమై కనబడింది.నిజమైన శాంతినికేతనమై దర్శనమిచ్చింది.అప్పుడే కానుగ చెట్టు మీది నుండి పక్షి ఒకటి ఎగిరి పోయింది.నాలో...కోపంలా!!

No comments:

Post a Comment