Thursday, January 3, 2019

రాజ్యాంగానికో నివేదన (లేఖా సాహిత్యం )

రాజ్యాంగానికి మాటలు వస్తే..మనసు వుంటే...ఎందరో వేదనల్ని రోదనల్ని వాదనల్ని ఆవేదనల్ని నివేదనల్ని  కచ్చింతంగా అర్థం చేసుకోగలుగుతుంది.కానీ రాజ్యాంగం రాజకీయ చట్రంలో బంధీగా మారిపోయిన దరిమిలా, ఎవ్వరు అధికారంలోకి వస్తే వాళ్ళు తమ ఇష్టానుసారం వాడుకుంటున్నారు.ఓట్ల కోసం- సీట్ల కోసం రాజ్యాంగ స్వరూప స్వభావాల్ని ఎప్పటికప్పుడు మార్చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.ఈ క్రమంలో మారుతున్నవి... పెరుగుతున్నవి... మాయచేస్తున్నవి....ఒకరికి మోదమై మరొకరికి ప్రమాదమై చెలరేగుతున్నవి...రిజర్వేషన్లు☹!సామాజిక వెనకబాటుతనం మాత్రమే ఇందుకు కొలమానం అవుతున్న పరిస్థితిలో  మన దేశం  ఎందరో మేధావుల్ని  కొల్పోతున్న మాట నిర్వివాదాంశం.ఆర్థిక వెనకబాటు తనాన్ని  కూడా పరిగణలోకి తీసుకుంటే మనదేశం  నిజంగా భాగ్యప్రదాత!
ఓ రాజ్యాంగమా! నీకు వందనం!!
నీవు గమనిస్తూనే వుంటావు నాకు తెలుసు...'కరము '   'ఖరము ' రెండింటికి  తేడా తెలియనివాళ్ళు, 'కల్లు '  ' కళ్ళు ' కు వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు భావిభారత పౌరులను తయారు చేసే స్థానాల్ని భర్తీ చేసివున్నారు.ఫిలాసఫి స్పెల్లింగ్ తెలియని వాళ్ళు...ఫిలాసఫి అర్థం తెలియని వాళ్ళు...తమ సిద్దాంతగ్రంధంలో అస్సలు ఏమి వుందో కూడా తెలియనివాళ్ళు భవిష్యత్ తరాల బాగుకోసం నియమించబడి వున్నారు.!నీకు తెలియదా ఏందీ...అస్సలు తెలియంది ఏముందీ....మెదళ్ళలో కంప్యూటర్స్ పెట్టుకున్న సరస్వతీ పుత్రులు అవకాశాలు లేక ఆగమై పోయిన సంగతి??
అమ్మా రాజ్యాంగమా ఉలిక్కిపడు...ఎందుకంటే కడుపునొచ్చిందని ఆసుపత్రికి వెళ్తే దిష్టి తగిలిందని మూడు రోడ్లు కలిసేకాడ ఎండుమిరపకాయలు ఉప్పుతో కలిపి దిష్టి తీసి వేయమని సలహాలు ఇచ్చే వైద్యమహాశయులు వున్న వ్యవస్థలో మనం బతుకుతున్నాం!
ఇక్కడ నాది ఏ కులమూ కాదు...ఏ వర్ణమూ కాదు..ఏ వర్గమూ కాదు...కులం  నా గడప వరకే! అది దాటితే నేను భారతీయురాలిని మాత్రమే!!నా భావి భారతం కోసం..నా భారతి బాగు కోసం...నా భావి తరాల ఆరోగ్యం కోసం...నా దేశ వెన్నముకల ప్రజ్ఞాపాటవాల కోసం...రాజ్యాంగాన్ని అర్థిస్థున్నాను!కనీసం 'విద్య...వైద్యం 'ఈ రెండు రంగాల్ని రిజర్వేషన్లకు మినహాయించమని!!!
          ఇట్లు...
         నిస్సహాయురాలైన
         భారతీయురాలు
               ✍తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి

No comments:

Post a Comment