Thursday, January 3, 2019

బతుకమ్మ పాట

బతుకమ్మ పాట
°°°°°°°°°°°°°రచన ;తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి
(పల్లవి, చరణలతో కూడిన పాటను, పాడుకోవడానికి అనుగుణంగా మార్పు చేసాను )

🌾తూరుపు కొండల్లో-- చందామామా...
    తెల్లారకుండానే--  చందామామా...
    తట్ట బుట్ట  పట్టి -- చందామామా
    తంగేడు కోసం --చందామామా..
    తరలిన పోరగాళ్ళు --చందామామా...

 🌻 పసుపు రంగుల్లో-- చందామామా...
     పూసిన అడవి  -- చందామామా...
     పూవుల్ల సొగసుకు  -- చందామామా..
     పులకించే పుడమి -- చందామామా..
     పురివిప్పే మనసు -- చందామామా...

 🌼 కాసిన గునుగులు-- చందామామా...
      కనువిందు జేయ --చందామామా..
      కదిలొచ్చే ఇంటికి  --చందామామా...
      కలుపులు కాదు -- చందామామా...
      కలిమి గురుతులు -- సందమామా...

   👏 సందడి ఊరంతా  -- చందామామా..
      సప్పట్ల తాళాలు  -- చందామామా...
      సాగిన పాటలు --  చందామామా...
     సరిలేని రాగాలు -- చందామామా...
     సక్కని  సంస్కృతి  -- చందామామ...

 🌱 తొమ్మిది రోజులు --  చందామామా
      తీరొక్క పేరు  --చందామామా...
      తీరుగా తలిచి --చందా మామా...
      త్రికోణ రూపం -- చందా మామా...
      తల్లీ నిను కొలిచి  -- చందా మామా...

🌿 ఆడపడుచులు --చందామామా..
     అందరూ గూడి -- చందమామా....
     ఆడిపాడగా  -- చందామామా..
     అమ్మ నీ కరుణ -- చందామామా...
     అందిన వరమయే  -- చందా మామా...

🍁  బొడ్డెమ్మ లాడంగా  -- చందామామా...
       బతుకమ్మ మెచ్చింది  -- చందమామా...
       బంగారు  గౌరమ్మ  -- చందమామా....
       బతుకులు  పండంగా  -- చందా మామా....
       బంధాలు నిలువంగా  -- చందమామా....

🍂  సద్దులు మోయంగా -- చందామామా...
       సింగిడి కొలువాయే -- చందామామా...
       సోపతి  వొదలం -- చందామామా...
       సాలు సాలుకు  -- చందామామా...
       సాదుకో తల్లీ  -- చందామామా...

🌺   పారేటి నీళ్లల్లో  -- చందమామా....
       పోయిరా తల్లీ -- చందామామా...
       పవిత్ర మూర్తివి -- చందా మామా
       పాడి పంటలు -- చందమామా...
       పిల్లా పాపలు -- చందమామా...
       పది కాలాలు  --  చందమామా.....
       పదిలంగా ఉండాలి -- చందమామా...2

No comments:

Post a Comment